దుబాయ్‌లో పర్యటించాలనుకునే భారతీయులకు కొత్త కష్టాలు వచ్చా యి. ఈ నెల 8 నుంచి 14 వరకు జరిగే దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌కు వెళ్లాలని చాలా మంది భారతీయులు ఉత్సాహంగా ఉన్నారు. కానీ దుబాయ్ ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెం ట్ అమలు చేస్తున్న కొత్త వీసా నిబంధనలు వీరిని నిరుత్సాహపరుస్తున్నాయి. టూరిస్ట్ వీసా కావాలంటే, పర్యాటకులు దుబాయ్ నుంచి తిరిగి వెళ్లడానికి కన్‌ఫర్మ్‌డ్ రిటర్న్ ఫ్లైట్ టికెట్ల కాపీని తప్పని సరిగా సమర్పించాలని నిబంధనలు చెప్తున్నాయి. అక్కడ బస చేసే హోటల్ అకామిడేషన్ కన్ఫర్మేషన్, ఇత ర వివరాలు, ఖర్చులకు తగినంత సొమ్ము నిరూపించే బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్లు లేదా లేఖ సమర్పించాలని చెప్తున్నాయి.