అమెరికాలోని ప్రముఖ న్యూయార్క్ సెంట్రల్ పార్క్‌లో భారతీయ పర్యాటక కుటుంబానికి చెందిన 18 ఏళ్ల యువకుడు రోమాంచ్ మహాజన్ ప్రాణాలు తీసిన ఘోర గుర్రపు బగ్గీ ప్రమాదం స్థానికంగా తీవ్ర అశాంతిని, సంచలనాన్ని సృష్టించింది. ఈ విషాదకర ఘటనను తీవ్రంగా పరిగణించిన న్యూయార్క్ సిటీ కౌన్సిల్ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంటూ.. నగరంలో దాదాపు 150 ఏళ్లుగా దిగ్విజయంగా కొనసాగుతున్న ప్రసిద్ధ గుర్రపు బగ్గీల సంప్రదాయాన్ని పూర్తిగా నిషేధించే చారిత్రాత్మక బిల్లును ఆమోదించింది.

2026 జూన్ 17న భారతీయ పర్యాటక కుటుంబం న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్‌లో గుర్రపు బగ్గీ సవారీ చేస్తుండగా ప్రమాదం జరిగింది. బగ్గీ డ్రైవర్ ప్రయాణికుల ఫొటో తీయడానికి కిందకు దిగిన సమయంలో గుర్రం అదుపు తప్పి వేగంగా పరుగెత్తింది. దీంతో బగ్గీలో ఉన్న 18 ఏళ్ల రోమాంచ్ మహాజన్ కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించినప్పటికీ అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై స్థానిక అధికారులు, పర్యాటక భద్రతకు సంబంధించిన సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.















