న్యూయార్క్ పోలీసు శాఖ కీలక ప్రకటన చేసింది. నగరంలో గత అయిదు రోజుల నుంచి కాల్పుల ఘటనల వల్ల ఎటువంటి మరణాలు కానీ, గాయాలు కానీ చోటుచేసుకోలేదని పేర్కొన్నది. గడిచిన 30 ఏళ్ల నుంచి తొలిసారి ఇలా జరిగినట్లు పోలీసు శాఖ తెలిపింది. న్యూయార్క్ సిటీ కాప్స్ శాఖ 30 ఏళ్లలో తొలిసారి, వరుసగా అయిదు రోజుల నుంచి ఎటువంటి తుపాకీ హింస చోటుచేసుకోలేదని చెప్పింది. కంప్యూటర్ స్టాటిస్టిక్స్ నమోదు చేస్తున్న నాటి నుంచి తొలి సారి షూటింగ్ బాధితులు లేరని పోలీసులు శాఖ తెలిపింది. ఎన్‌వైపీడీ బృందం సాహసోపేత విధనిర్వహణ వల్ల నగరంలో తుపాకీ కాల్పుల సంఘటనల లేవని సిటీ పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఏడాది న్యూ ఇయర్ రోజున క్వీన్స్‌లో ఉన్న నైట్‌క్లబ్‌లో చివరి సారి షూటింగ్ ఘటన నమోదు అయ్యింది. ఆ కాల్పుల్లో 11 మంది గాయపడ్డారు. డిసెంబర్ 2024లో కూడా న్యూయార్క్‌లో గన్ సంబంధిత మరణాలు చోటుచేసుకోలేదు. కానీ డిసెంబర్ 2023లో మాత్రం తుపాకీ హింసకు 9 మంది బలైనట్లు ఎన్‌వైపీడీ డేటా పేర్కొన్నది. న్యూయార్క్ సిటీలో వరుసగా మూడవ సంవత్సరం కూడా కాల్పుల సంబంధిత హింసాత్మక ఘటనల సంఖ్య తగ్గినట్లు పోలీసులు వెల్లడించారు.