తాహిర్, పల్లవి హీరో హీరోయిన్లుగా బత్తిని ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత బి.నరేష్ కుమార్ రెడ్డి నిర్మించిన చిత్రం నెక్ట్స్ లెవల్. ఈ చిత్రంలో మహేందర్ నాథ్, కోటీ యాదవ్, తులసీ మోహన్, శ్వేతాంజలి, మమత, రుషిత, సావిక తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను ప్రముఖ నిర్మాత, దర్శకుడు వి.ఎన్. ఆదిత్య విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దర్శకుడు వి.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ బత్తిని ఫిలింస్ బ్యానర్‌పై నిర్మాత నరేష్ నిర్మించిన చిత్రం నెక్ట్స్ లెవల్. ఇప్పుడున్న టాప్ నిర్మాతలతో చాలా మంది లిస్ట్‌లో నరేష్‌గారు కూడా చేరాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా విజయం సాధించి, సినిమా టైటిల్‌కు తగ్గట్టుగా ఆయన కూడా నెక్ట్స్ లెవల్ ప్రాడ్యూసర్‌గా ఎదగాలని, అందుకు ఈ సినిమా పునాది కావాలని కోరుకుంటున్నాను. చిత్ర నిర్మాత బి. నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రమిది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన చిత్రమిది.ఈ చిత్రంతో గోపీ దేవెళ్ళ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, శ్రీనివాస్ వంగపల్లి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంగీతం : జై, సినిమాటోగ్రఫీ : ఎమ్‌డీ. రఫీ, ఎడిటర్: ప్రసాద్ త్రివర్ణం, పీఆర్వో: బి.వీరబాబు, సహనిర్మాత : శ్రీనివాస్ వంగపల్లి, నిర్మాత : బి. నరేష్ కుమార్ రెడ్డి, దర్శకత్వం : గోపీ దేవెళ్ల.
