
నిహారిక యాంకర్‌గా, హీరోయిన్‌గా, నిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది. నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు సినిమా సంచలన విజయం సాధించింది. ముందుగా హీరోయిన్ గా, తర్వాత వెబ్ సిరీస్ ల్లో నటించింది. కానీ చివరకు నిర్మాతగా స్థిరపడింది. కొత్త డైరెక్టర్, కొత్త నటీనటులతో చిన్న సినిమాగా వచ్చిన కమిటీ కుర్రోళ్లు చిత్రం 50 కోట్ల వసూళ్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు నిహారిక నిర్మాతగా రెండో సినిమాతో పలకరించబోతుం ది. నేడు నిహారిక తన రెండు సినిమాని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో ఫుల్ ఫామ్ లో ఉన్న నటుడు సంగీత్ శోభన్ హీరోగా నటించబోతున్నాడు. సంగీత్ ఇందులో మెయిన్ లీడ్ పోషించబోతున్నాడు. సంగీత్ సోలో హీరోగా నటించనున్న తొలి సినిమా ఇదే. ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
