Skip to main content

Namaste NRI

ట్రెండింగ్ లవ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసిన నిహారిక

వర్ధన్‌ గుర్రాల, హమరేశ్‌, శాంతి తివారి, నిత్యశ్రీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ట్రెండింగ్‌ లవ్‌. దొరకునా ఇటువంటి ప్రేమ ఉపశీర్షిక. హరీశ్‌ నాగరాజు దర్శకుడు. సోనూగుప్తా, రూపేశ్‌ డి గోయల్‌ నిర్మాతలు. మెగా డాటర్‌ కొణిదెల నిహారిక ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దర్శకుడు హరీశ్‌తో గతంలో నేను ఓ షార్ట్‌ఫిల్మ్‌కు పనిచేశా. టాలెంటెడ్‌ డైరెక్టర్‌. ఈ సినిమాను ట్రెండీ లవ్‌స్టోరీగా తెరకెక్కించాడు. విజువల్స్‌ చాలా బాగున్నాయి అని చెప్పింది. నేటి యువతకు కనెక్ట్‌ అయ్యే ప్రేమకథా చిత్రమిదని, వినోదానికి పెద్దపీట వేశామని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బ్రహ్మతేజ మరిపూడి, సంగీతం: సునీల్‌కశ్యప్‌.

Social Share Spread Message

Latest News