నిఖిల్ హీరోగా నటిస్తోన్న చిత్రం స్పై. ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తుండగా, సన్యా ఠాకూర్ రెండో కథానాయిక. ఆర్యన్ రాజేశ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎడిటర్ గ్యారీ బీహెచ్ డైరెక్టర్. న్యూఢిల్లీలోని ఐకానిక్ ల్యాండ్‌మార్క్ కర్తవ్య పథ్ (రాజ్‌పాత్)లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద స్పై టీజర్‌ను ఆవిష్కరించారు. మకరంద్ దేశ్‌పాండే భగవాన్ జీ ఫైల్స్ గురించి తన టీం మెంబర్స్‌కు వివరించే సీన్లతో టీజర్ షురూ అవుతుంది. ఆజాద్ హింద్ ఫౌజ్ సృష్టికర్త సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదాన్ని కవర్-అప్ స్టోరీగా పేర్కొన్న అతడు, భారత దేశ నిగూఢ రహస్యమైన నేతాజీ మరణం మిస్టరీని ఛేదించే బాధ్యతను స్పై (నిఖిల్) కు అప్పగిస్తాడు. ఈ క్రమంలో సాగే యాక్షన్ సన్నివేశాలతో సినిమా ఉండబోతున్నట్టు టీజర్‌తో చెప్పేశాడు డైరెక్టర్ ఈ చిత్రాన్ని ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కే రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. స్పై మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రానికి కే రాజశేఖర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా స్టోరీ కూడా అందిస్తున్నాడు. మిస్టరీని చేధించే క్రమంలో సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సినిమా రాబోతుందని టీజర్ చెబుతోంది. ఈ కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ స్పై థ్రిల్లర్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. స్పై ఈ ఏడాది జూన్ 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-66.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/45af6911-9449-466d-a7e1-ba146800284b-66.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/638bff07-efd2-4cc9-8546-98039833db3c-70.jpg)