నిఖిల్ హీరోగా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. నిర్మాతణ శరత్ మరార్, జెమినీ కిరణ్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహుర్తం సన్నివేశానికి గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించగా నిర్మాత రాజశేఖర్ రెడ్డి క్లాప్ కొట్టారు. నిర్మాత కుమార్తె, కుమారుడు ఈశన్వి, ధృవ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిఖిల్ సరసన ఐశ్వర్యామీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. ఇందులో గూఢచారి పాత్రలో నటిస్తున్నారు. మనోజ్ రెడ్డి, కెమెరామెన్, శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. అనిరుధ్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి రచయిత. కే.రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చరణ్ తేజ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)