అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఇండియన్ అమెరికన్ నిక్కీ హేలి నిలిచారు. ఆమె ఎన్నికల ప్రచారా న్ని ప్రారంభించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేశారు. 2024లో జరగనున్న ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఆమె అమెరికా మాజీ అధ్యక్షు డు డోనాల్డ్ ట్రంప్‌తో పోటీ పడుతున్నారు. 51 ఏండ్ల నిక్కీ హేలీ ఐరాసలో అమెరికా అంబాసిడర్‌గా పని చేశారు. రెండు పర్యాయాలు సౌత్ కరోలినా గవర్నర్‌గా ఎన్నికయ్యారు. పంజా బీ సిక్కు కుటుంబానికి చెందిన నిక్కీ హేలీ అస లు పేరు నిమ్రత నిక్కీ రంధావా. 1960లో వీరి కుటుంబం పంజాబ్ నుంచి అమెరికాకు వలసవెళ్లింది. 2016లో బాబీ జిందాల్, 2020లో కమలా హ్యారిస్ కూడా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు.