మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి హీరోలుగా నటిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమా నుంచి నీలాంబరి నీలాంబరి అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. మణిశర్మ సంగీత సారథ్యం వహించారు. ఈ సినిమాలో ఇప్పటికే లాహే పాటను విడదుల చేసిన సంగతి తెలిసిదే. నీలాంబరి నీలాంబరి పాటను రామ్‌చరణ్, పూజా హెగ్డే చిత్రీకరించారు. ఈ లిరికల్ వీడియోలో సాంగ్‌కు సంబంధించి కొన్ని క్లిప్పింగ్స్ పాట చీత్రీకరణకు సంబంధించిన మేకింగ్ వీడియో కూడా విడుదల చేశారు. పాట విడుదల అనంతరం మెగాస్టార్ చిరంజీవిపై పాటపై స్పందించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అని మరో మారు రుజువు చేస్తున్న నీలాం బరి అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహ్ర పాడినీ పాటకు అనంత శ్రీరాం సాహిత్యం అందించారు. కొరాటాల శివ దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)