ప్రపంచంలోని 100 మంది శక్తివంతమైన మహిళల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా ఆరుగురు భారతీయ మహిళలకు చోటు దక్కింది. హెచ్‌సీఎల్ టెక్ చైర్‌పర్సన్ రోషిణి నాడార్ మల్హోత్ర (53వ స్థానం), సెబీ చైర్‌పర్సన్ మాధువి పురి (54), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ సోమా మండల్ (67), బిట్‌కాయిన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిరణ్ మజూందర్ షా (72) నైకా వ్యవస్థాపకురాలు ఫాల్గుని నాయర్ (89) కూడా జాబితాలో చోటు దక్కింది. నిర్మల వరుసగా నాలుగో ఏడాది ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 2019 లో 34, 2020లో 41, 2021లో 37వ స్థానంలో నిలిచిన ఆమె ఈసారి 36వ స్థానాన్ని దక్కించుకున్నారు.