అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెలెన్‌తో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. జీ`20 ప్రాధాన్యాలు, అంతర్జాతీయ ఆర్థిక రంగ సవాళ్ల పరిష్కారానికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం లాంటి అంశాలపై ఇందులో ఇరువురు చర్చించారని ఎక్స్ ( ఇంతకుమునుపు ట్విటర్) ప్లాట్‌ఫామ్ ద్వారా ఆర్థిక శాఖ తెలిపింది. నేడు జీ`20 లీడర్‌షిప్ సదస్సు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశం జరగడం గమనార్హం.














