నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా ఎక్స్ట్రా ఆర్డీనరి. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాపై సినీ లవర్స్ మంచి ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి. డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై మంచి అంచనాలే నెలకొల్పాయి. తాజాగా ఈ సినిమా నుంచి నితిన్ క్లాస్సీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నితిన్ ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్టుగా కనిపించబో తున్నట్లు టాక్. అంతేకాకుండా కెమెరాలో పడాలనే నితిన్ తాపత్రయం ప్రేక్షకులను మాములుగా ఎంటర్టైన్ చేయదని ఇన్సైడ్ టాక్. షూటింగ్ బ్యాక్ గ్రౌండ్లో కనిపించే జూనియర్ ఆర్టిస్ట్‌ల బాధను ఈ సినిమాలో ఫన్నీ యాంగిల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారట. హారీస్ జైరాజ్ స్వరాలు సమకూర్చుతున్న ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నాడు.