Namaste NRI

నితిన్‌ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ నుంచి డేంజర్ పిల్లా

టాలీవుడ్ యువ హీరో నితిన్‌  నటిస్తోన్న తాజా చిత్రం ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌.  శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది.  యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో నితిన్‌ స్మగ్లర్‌గా కనిపించనుడగా, నితిన్ హోం బ్యానర్‌ శ్రేష్ఠ్‌ మూవీస్‌ పై సుధాకర్‌ రెడ్డి నిర్మిస్తున్నాడు.  రీసెంట్‌గా డేంజర్‌ పిల్లా లిరికల్ ప్రోమోను విడుదల చేయగా,  మ్యూజిక్‌ లవర్స్‌ను ఇంప్రెస్ ఇస్తోంది. ముందుగా అందించిన అప్‌డేట్ ప్రకారం డేంజర్ పిల్లా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేశారు మేకర్స్‌. అందమైన లొకేషన్లలో హర్ట్‌ టచింగ్‌ మెలోడీగా సాగుతున్న ఈ పాటను కే కృష్ణకాంత్ రాశాడు. అర్మాన్ మాలిక్ ఈ పాట పాడాడు. శేఖర్ వీజే పాటకు నృత్యరీతులు సమకూర్చాడు.ఈ చిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 23న రిలీజ్‌ చేయనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events