నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న హీస్ట్ కామెడీ చిత్రం రాబిన్‌హుడ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నది. డబ్బు కోసం రాబిన్‌హుడ్ ఎంత దూరమైనా వెళతాడు. సంపన్నులను లక్ష్యంగా చేసుకొని చోరీలు చేస్తుంటాడు. అతనికి నిర్ధిష్టమైన అజెండా అంటూ ఏమీ లేదు. కేవలం డబ్బు సంపాదిం చడమే ఏకైక లక్ష్యం. మరి అలాంటి డేరింగ్ రాబిన్‌హుడ్ జర్నీ ఏమిటో తెలుసుకోవాలంటే సినిమా చూడా ల్సిందే అంటోంది చిత్ర బృందం.
ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో రాబిన్‌హుడ్‌గా డిఫరెంట్ గెటప్పుల్లో నితిన్ ఆకట్టుకున్నాడు. ఆయన లుక్స్ కూడా స్టైలిష్ గా ఉన్నాయి. వినోదం, యాక్షన్ అంశాలతో టీజర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా లో నితిన్ పాత్ర కొత్త పంథాలో ఉంటుందని, వినోదానికి పెద్దపీట వేశామని మేకర్స్ తెలిపారు. శ్రీలీల, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రచన-దర్శకత్వం: వెంకీ కుడుముల.