బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు. రాష్ట్రంలో తాము మహాకూటమితో పొత్తును తెంచుకోవాలని నిర్ణయించుకున్నామని ఆయన గవర్నర్‌కు తెలిపారు. ఉదయం జేడీయూ ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం నితీశ్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామా లేఖ ఇచ్చారు. నితీశ్ రాజీనామాకు గవర్నర్ అర్లేకర్ ఆమోదం తెలిపారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరేవరకు ఆపద్ధర్మ ముఖ్య మంత్రిగా కొనసాగా లని సూచించారు. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్‌కుమార్ బీజేపీతో కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎంగా మళ్లీ ఆయనే ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ కూడా ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నట్లు మరో ప్రచారం జరుగు తోంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)