రష్యాపై ఆంక్షల పరంపర కొనసాగుతున్నా, ఆ దేశం నుంచి ఇంధన సరఫరాలను వదులుకో లేమని జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో తమ వైఖరిలో ఏ మార్పూ లేదని అన్నారు. తమ ఇంధన అవసరాలను ఇతర మార్గాల్లో తీర్చుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశామని తెలిపారు. పలు యూరప్ దేశాలు రష్యా గ్యాస్‌పై తమకంటే ఎక్కువగా ఆధారపడ్డాయన్నారు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలతో కలిసి రష్యాను కఠినాతి కఠినమైన ఆంక్షలతో ఇప్పటికే కుంగదీస్తున్నామని గుర్తు చేశారు. జర్మనీ గ్యాస్ అవసరాల్లో దాదాపు సగం రష్యానే తీరుస్తున్న విషయం తెలిసిందే.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)