Namaste NRI

వద్దు.. ఆ సాహసం చేయొద్దు : జో బైడెన్

అణు, రసాయన ఆయుధాలను రష్యా ప్రయోగించే అవకాశం ఉందని వస్తున్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. ఈ సందర్భంగా బైడెన్‌ మీడియాతో మాట్లాడుతూ ఆ సాహసం చేయొద్దని మాస్కోను హెచ్చరించారు. వద్దు ఇది మొత్తం యుద్ధ స్వరూపాన్నే మార్చేస్తుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వేళా అలాంటి దాడులకు పాల్పడితే పర్యవసానాల ఆధారంగా అమెరికా స్పందిస్తుందని తెలిపారు. అణు, రసాయన దాడులకు ప్పాలడితే, మునుపెన్నడూ లేనివిధంగా ప్రపంచ వేదికపై రష్యా పరిస్థితి మరింత దిగజారుతుందన్నారు. ఆ దేశం ఎంతవరకు వెళ్తుందనేదానిపై ఆధారపడి మిగతావాటి స్పందన ఉంటుందని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events