ఆండ్రియా జెరెమియా కథానాయికగా నటిస్తున్న చిత్రం నో ఎంట్రీ. ఈ చిత్రానికి ఆర్.అళగు కార్తీక్ దర్శకుడు. శ్రీధర్ అరుణాచలం నిర్మాత. ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ తొలిసారిగా ఆండ్రియా నటిస్తున్న యాక్షన్ చిత్రమిది. కథ విషయానికొస్తే అటవీ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లిన కొంత మంది స్నేహితులు అడవిలోని కొండ శిఖరంలో ఉన్న లగ్జరీ విల్లాలో బస చేస్తారు. ఆ ఇంటిని క్రూరమైన అడవి కుక్కలు చుట్టుముడతాయి. ఆ కుక్కల భారీ నుంచి వారు ఏ విధంగా తప్పించుకున్నారన్నదే ఈ చిత్ర కథ. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. త్వరలోనే చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తాం అన్నారు.