అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించవద్దని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అన్నారు. పోలింగ్ సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) హ్యాకింగ్‌కు గురవ్వడంపై టెస్లా, స్పేస్‌ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడం ద్వారా హ్యాకింగ్‌ను నివారించవచ్చని సూచించారు. అమెరికా నియంత్రణలోని ప్యూర్టోరికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.