ఉక్రెయిన్ యుద్ధంలో జోక్యం చేసుకునేందుకు ఏ దేశం ప్రయత్నించినా మెరుపువేగంతో స్పందిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో చట్టసభ ప్రతినిధులతో మాట్లాడారు. మమ్ముల్ని ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదని, అవసరమైతే అన్ని ఆయుధాలను ప్రయోగిస్తామన్నారు. బాలిస్టిక్ మిస్సైళ్లతో పాటు న్యూక్లియర్ ఆయుధాలను చెందిన అంశాలపై పుతిన్ పరోక్షంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ మిత్ర దేశాలకు ఆ దేశానికి ఆయుధాల సరఫరాను పెంచేశాయి. రష్యాను ఉక్రెయిన్ ఓడిరచాలన్న ఉద్దేశంతో అమెరికా ఆయుధాలను తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పుతిన్ తాజా వార్నింగ్ ఇచ్చారు.
