ఇటీవల భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండిరచారు. వైట్‌హౌస్ ఆధ్వర్యంలో ఐక్యంగా నిలబడదాం పేరిట నిర్వహించిన సదస్సులో బైడెన్ మాట్లాడుతూ తెల్ల జాతి ఆధిపత్యానికి, జాత్యంహకార హింసకి తమ దేశంలో చోటు లేదన్నారు. హిందువులు, సిక్కులు, ముస్లిమ్‌లు ఎవరిపై జాత్యహంకార దాడులు జరిగినా తామంతా వారికి మద్దతుగా నిలబడతామని భరోసా ఇచ్చారు. మేము ఎక్కడ నుంచి వచ్చామన్నది ముఖ్యం కాదు. మేమంతా ఒక్కటే. విద్వేషంతో కూడిన హింసకు వ్యతిరేకంగా మేము ఒక్కటిగా నిలబడతాం. అందరినీ ఐక్యం చేస్తాం అని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం ఆసియన్ అమెరికన్లు రోడ్ల మీదకి కూడా రావడానికి భయపడే పరిస్థితులున్నప్పుడు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో కలిసి తాను అట్లాంటికి వెళ్లి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచామన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)