Namaste NRI

ఇలాంటి కాన్సెప్ట్‌తో తెలుగులో ఇప్పటివరకూ సినిమా రాలేదు :హర్షిత్‌ రెడ్డి

హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా దీవాన. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు నిర్మాత అల్లు అరవింద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ దీవాన హృదయాన్ని కదిలించే ప్రేమకథా చిత్రమని, ైక్లెమాక్స్‌లో ప్రతీ సీన్‌ కన్నీళ్లు పెట్టిస్తుందని చెప్పారు.

దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమాలో వన్‌సైడ్‌ లవ్‌తో సమానంగా పేరెంట్స్‌ లవ్‌ ఉంటుందని, తెలంగాణ నుంచి పదిమంది యాక్టర్స్‌ని తీసుకున్నామని చెప్పారు. ఇది వన్‌సైడ్‌లో నడిచే లవ్‌స్టోరీ. జోనర్‌ ఏంటని అడిగితే గుండెల్ని పిండేసే జోనర్‌ అని చెప్పొచ్చు. ఇందులోని ప్రేమికులు ఏడిపిస్తారు, నవ్విస్తారు. మనల్ని ప్రేమలో పడేలా చేస్తారు అని నిర్మాతలు వాసుదేవ్‌ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి తెలిపారు. ఇదొక టైమ్‌లెస్‌ లవ్‌స్టోరీ అని, ఇలాంటి కాన్సెప్ట్‌తో తెలుగులో ఇప్పటివరకూ సినిమా రాలేదని హీరో హర్షిత్‌ రెడ్డి తెలిపారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ కార్యక్రమంలో హీరో విశ్వక్‌సేన్‌, నిర్మాత ధీరజ్‌ మొగిలినేని తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events