Namaste NRI

దానిని ఎవరూ ఆపలేరు… అది చరిత్ర :దిల్‌ రాజు

మహేష్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అగ్ర నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ  బాగున్న సినిమాను ప్రేక్షకులు తప్పకుండా చూస్తారు. దానిని ఎవరూ ఆపలేరు. అది చరిత్ర. ప్రతి ఏడాది సంక్రాంతి సినిమాల విషయంలో నిర్మాతల మధ్య చిన్నపాటి వార్స్‌ జరుగుతూనే ఉంటాయి. బిజినెస్‌ ఛాలెంజెస్‌లో అవన్నీ ఓ భాగం. అంతేకానీ ఇక్కడ ఎవరికి ఎవరు శత్రువులు ఉండరు అన్నారు.

రాత్రి ఒంటిగంట షోస్‌కు మిశ్రమ స్పందన లభించింది. వాస్తవాలేమిటో తెలుసుకోవడానికి సుదర్శన్‌ థియేటర్‌ వెళ్లి సినిమా చూశాను. తల్లీకొడుకు సెంటిమెంట్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సంక్రాంతి సీజన్‌లో ఇంటిల్లిపాది చూసే పర్‌ఫెక్ట్‌ మూవీ అనిపించింది. ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. పండగ తర్వాత సినిమా ఎంత వసూళ్లు సాధించిందో తెలుస్తుంది అన్నారు.   నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ మేం ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన లభిస్తున్నది. తొలిరోజు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్‌ లభించాయి. తొలుత మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినప్పటికీ ఈవినింగ్‌ షోస్‌కు అంతా సమసిపోయి పాజిటివ్‌ ట్రెండ్‌ కనిపించింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ బాగా చూస్తున్నారు. చక్కటి సెంటిమెంట్‌, పాటలు, వినోదం అంశాలతో సంక్రాంతి మూవీగా ఆకట్టుకుంటున్నది అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events