ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. అయితే ఆ యుద్ధంలో ఎవరూ విజయం సాధించలేరని ఐక్యరాజ్యసమితి పేర్కొన్నది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగి వంద రోజులు పూర్తి అయింది. ఈ నేపథ్యంలో యూఎన్ స్పందించింది. ఈ యుద్ధం గెలుపు ఎవరికీ దక్కదని, గడిచిన వంద రోజుల్లో నష్టమే జరిగిందని, ఇండ్లను ఉద్యోగాలను, ప్రాణాలను కోల్పోయారని యూఎస్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ అమిన్ అవద్ తెలిపారు. యుద్ధం వల్ల ప్రజలపై భారం పడిరదని, సాధారణ ప్రజల జీవితాలు నాశనమైనట్లు అవద్ తెలిపారు. కేవలం మూడు నెలల్లోనే సుమారు కోటి 4 లక్షల మంది ఇండ్లు విడిచి వెళ్లారన్నారు.
