తమ దేశంలోని కొద్ది భూభాగాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. జాతినుద్దేశంచి ఆయన ప్రసంగించారు. ఉక్రెయిన్`రష్యా సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తలను నిలువరించడానికి తాము శాంతియుత, దౌత్య మర్గాలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. శాంతి చర్చలకు రష్యా విఘాతం చేసిందని ఆరోపించారు. తాము శాంతిని కోరుకుంటున్నామని, దేశంలోని భూభాగాన్ని వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రష్యా చర్యలను ఖండిరచిన ఆయన దౌత్యం ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించాలని కోరుకుంటున్నామని తెలిపారు. తాము తమ సొంత భూమిలో ఉన్నామని, ఎవరికీ భయపడేది లేదని తెలిపారు. రష్యాపై చర్య తీసుకోవాలని తమ మిత్ర దేశాలను కోరారు.