Skip to main content

Namaste NRI

శాంతి చర్చలు లేవ్ …బేషరతుగా లొంగిపోవాల్సిందే

ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రమవుతున్న వేళ అమెరికా ఇరాన్‌కు మరో కీలక హెచ్చరిక జారీ చేసింది. ఎలాంటి షరతులు లేకుండా ఇరాన్ తమ ముందు లొంగిపోవాల్సిందేనని, అంతవరకు ఎలాంటి ఒప్పందం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు.ఇతర దేశాల మధ్యవర్తిత్వానికి అంగీకరిస్తామని, అయితే, ముందుగా ఇజ్రాయెల్, అమెరికా నుంచే ఆ స్పందన రావాలని ప్రకటించింది. అంతవరకు తమ దేశ గౌరవం, సార్వభౌమాధికారం కోసం పోరాడుతామని ఇరాన్ స్పష్టం చేసింది.

ఇరాన్ కాస్త తగ్గినట్లు అనిపించిన నేపథ్యంలో అమెరికా నుంచి కూడా సానుకూల స్పందన వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోమన్నారు. శాంతి చర్చలు ఉండవన్నారు. ఏ షరతులు లేకుండా అమెరికాకు లొంగిపోవాల్సిందే అని ఇరాన్‌కు స్పష్టం చేశాడు. ఇలా చేస్తే ఇరాన్‌లో కొత్త నాయకత్వానికి అంగీకరిస్తామని, ఇరాన్ పునర్మిర్మాణానికి కూడా సహకరిస్తామన్నారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ నినాదంలాగా మేక్ ఇరాన్ గ్రేట్ ఎగైన్ అంటూ చెప్పారు. అమెరికాతోపాటు తమ మిత్ర దేశాలు కూడా ఈ విషయంలో సహకరిస్తాయని హామీ ఇచ్చారు.


Social Share Spread Message

Latest News