
చైనాలో ఆ దేశ పౌరులతో అమెరికా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రేమ, లైంగిక సంబంధాలు పెట్టుకోవద్దంటూ అమెరికా నిషేధం విధించింది. చైనాలో అమెరికా మిషన్ కోసం పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు, భద్రతాపరమైన అనుమతులున్న కుటుంబ సభ్యులు, కాంట్రాక్టర్లకు నిషేధం వర్తిస్తుందని తెలిపింది. చైనాలో అమెరికా రాయబారి నికోలస్ బర్న్స్ ఈ ఏడాది జనవరిలో తన బాధ్యతల నుంచి తప్పుకున్న వెంటనే ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయని తెలిపింది. ఉల్లంఘనకు పాల్పడ్డ వారిని విధుల నుంచి తొలగిస్తామని అమెరికా హెచ్చరించింది.
