రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన చిత్రం కోట బొమ్మాళి పీఎస్. ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకుడు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా వరలక్ష్మీ మాట్లాడుతూ తమిళంలో నేను పోలీస్ క్యారెక్టర్స్ చాలా చేశాను. కానీ తెలుగులో మాత్రం ఇదే మొదటిసారి. నా దృష్టిలో కథే హీరో. ఈ సినిమాలో పాత్రపరంగా చాలా కొత్తగా కనిపించే ప్రయత్నం చేశా అని చెప్పింది. ఈ సినిమాలో నేను, శ్రీకాంత్ పోలీస్ ఆఫీసర్స్ పాత్రల్లో కనిపిస్తాం. ఇద్దరిలో ఒకరు క్రిమినల్ అయితే ఎలా ఉంటుంది? రాజకీయ ఒత్తిళ్లు ఎలా ఉంటాయి? అనే ఆంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. మలయాళ నాయట్టు కి రీమేక్ అయినా తెలుగులో చాలా మార్పులు చేశారు. ఈ సినిమాలో స్మోకింగ్ చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఇప్పటివరకు ఏ సినిమాలో అలాంటి సీన్స్ చేయలేదు. పాత్రపరంగా కంపల్సరీ కాబట్టి చేయాల్సి వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు క్యారెక్టర్ నచ్చితే ఏ జోనర్ కథలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నా అన్నారు. ఈ చిత్రం ఈ నెల 24న విడుదలకానుంది.














