ప్రముఖ కాగ్నిటివ్ సైకాలజిస్ట్, నోబెల్ అవార్డు గ్రహీత డానియెల్ కాహ్నేమాన్ (90) కన్నుమూశారు. మనుషులు నిర్ణయాలు తీసుకునే విధానంపై లోతైన పరిశోధనలు చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింప పొందారు. కాహ్నేమాన్ మృతిపై ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజిమెన్ నెతాన్యాహు విచారం వ్యక్తం చేశారు. ఓ అత్యున్నత మేధావిని కోల్పోయామని, ఆయన పరిశోధన చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మనుషులు వాస్తవాలను ఎలా గ్రహిస్తారు? అనే విషయంలో ఆయన చేసిన పరిశోధన విప్లవాత్మకమైన మార్పులకు కారణమైందని పేర్కొన్నారు. ఆయన తదనంతరం పరిశోధన మానవాళికి ఎంతో ఉపయోగపడుతాయని.. భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నా రు. అయితే, అనిశ్చిత పరిస్థితుల్లో మనుషులు నిర్ణయాలు తీసుకునే తీరును ఆర్థికశాస్త్రంతో అనుసంధానం చేస్తూ ఆయన పరిశోధన చేపట్టారు. ఈ పరిశోధనకు గాను 2002లో నోబెల్ పురస్కారం దక్కింది. మనుషుల నిర్ణయాలు తార్కికంగా ఉంటాయని ఎకనమిక్ థియరీ భావిస్తే.. అనిశ్చిత పరిస్థితుల్లో భిన్నంగా ప్రవర్తిస్తారని తన పరిశోధనతో రుజువు చేశారు. కాహ్నేమాన్ పలు యూనివర్శిటీల్లో అధ్యాపక, పరిశోధన బాధ్యతలు నిర్వర్తించారు.