Namaste NRI

క్లాడియో గోల్డిన్‌కు నోబెల్‌ పురస్కారం

అమెరికా ఆర్థిక చరిత్రకారిణి, ప్రఖ్యాత హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ క్లాడియా గోల్డిన్‌ను ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం వరించింది. అర్ధశాస్త్రంలో నోబెల్‌ ప్రైజ్‌కు క్లాడియా గోల్డిన్‌ను ఎంపిక చేశారు. ప్రపంచ మహిళల లేబర్‌ మార్కెట్‌ ఫలితాలపై అవగాహనను ఇనుమడింపజేసేలా పలు సిద్ధాంతాలకు క్లాడియో గోల్డిన్‌ రూపకల్పన చేశారు. ఇప్పటివరకు అర్ధశాస్త్రంలో నోబెల్‌ ప్రైజ్‌కు ఎంపికైన మూడో మహిళ, క్లాడియో గోల్డిన్‌. గతంలో 2009లో ఎలినార్‌ ఒస్ట్రోమ్‌, 2019లో ఎస్తేర్‌ డఫ్లో నోబెల్‌ అందుకున్నారు.  1969 నుంచి 2022 వరకు అర్ధశాస్త్రంలో 54 పర్యాయాలు నోబెల్‌ పురస్కారం ఇచ్చారు. నోబెల్ విజేతలకు డిసెంబర్‌ 10న బహుమతులను ప్రదానం చేయనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events