కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించిన కేసులో ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకు ఆయన హాజరుకాలేదు. దీంతో జగ్గారెడ్డికి కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13కి ప్రజా ప్రతినిధుల కోర్టు వాయిదా వేసింది.
