మే నెల 19 వ తేదీ ఆదివారము జరిగిన డల్లాస్ ఫోర్ట్ వర్త్, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం , టాంటెక్స్ ”నెలనెల తెలుగువెన్నెల” ,తెలుగు సాహిత్య వేదిక 202 వ సాహిత్య సదస్సులో ”పద్య రచనల పట్టు విడుపులు ”అంశంపై నిర్వహించిన సదస్సు చాలా చాలా బాగా జరిగింది .కొప్పెల్ టెక్సాస్ నగరమునందు శ్రీ లెనిన్ వేముల వారి స్వగృహము వేదికగా ప లువురు సాహితీప్రియులు ప్రత్యక్షము గాను మరికొందరు సాహితీ ప్రియులు అంతర్జాలములో పాల్గొనడం ద్వారా జరిగిన ”నెలనెలా తెలుగు వెన్నెల” ,తెలుగు సాహిత్య వేదిక ప్రారంభ సూచికగా పురందర దాసు విరచిత కన్నడ భక్తి గేయం ” ఒ ల్లనో హరి కొల్లనో ….. ”అనే కీర్తనను చిరంజీవి సమన్విత కల్యాణి రాగంలో వీనుల విందుగా పాడి సాహితీ ప్రియులను భక్తి పారవశ్యులను చేసింది .. తన మధుర కంఠంతో కార్యక్రమ ప్రారంభాన్ని శోభాయమానం చేసిన చిరంజీవి సమన్విత ను పలువురు సాహితీ ప్రియులు అభినందించడం జరిగింది.సంస్థ సమన్వయ కర్త శ్రీ లక్ష్మినరసింహ పోపూరి గారి సహకారముతో బోర్డు ఆఫ్ ట్రస్టీస్ మెంబర్ మరియు టాంటెక్స్ సంస్థకార్యక్రమాల సలహాదారు శ్రీ దయాకర్ మాడా గారు మరియు శ్రీలేనిన్ వేముల గారు నేటి సాహితీ సదస్సు అంతర్జాల ప్రసార ఏర్పాట్లను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు.…తొలుత సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ నరసింహా రెడ్డి ఊరిమిండి గత 72 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ”మన తెలుగు సిరి సంపదలు” అందరినీ ఆకట్టుకున్నది కార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చెయ్యాలనే శుభ సంకల్పంతో ప్రారంభించిన ధారావాహికశీర్షిక ”మనతెలుగుసిరిసంపదలు”. చమత్కార గర్భిత పొడుపు పద్యాలు, ప్రహేళికలు,జాతీయాలు పొడుపు కథలతో సహా దాదాపు యాభై ప్రక్రియల సమాహారమే ఈ శీర్షిక ప్రత్యేకత. స్థానిక,ప్రాంతీయ ,జాతీయ స్థాయిలో ప్రజాదరణ పొందిన ,పొందుతున్న ఈ శీర్షికలో వైవిధ్య భరితమైన తెలుగు భాషా ప్రయోగాలను స్పృశించడం డాక్టర్ నరసింహా రెడ్డి ఊరిమిండి వారి మరొక ప్రత్యేకత., ” ఈసందర్భంగా డాక్టర్ నరసింహా రెడ్డి ఊరిమిండి మాట్లాడుతూ ”మన తెలుగు సిరి సంపదలు” ఇప్పడు జగద్విదితమైనదనీ , గత వారం ఏప్రిల్ 28 వ తేదీన ” ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఆధ్వర్యంలో ”నెల నెలా తెలుగు వెలుగు ”అంతర్జాల దృశ్య సమావేశంలో ”తెలుగు సాహిత్యంలో సామెతలు ,నుడికారాలు,పొడుపు కథలు అనే కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందనీ,ఆవిధంగా ”మన తెలుగు సిరి సంపదలు ”ప్రపంచ వ్యాప్తంగా సాహితీ ప్రియులను ఆకట్టుకొనడం తన కెంతో తృప్తి నిచ్చిందనీ తెలిపారు.ఈవిషయము తెలియడంతో డాక్టర్ నరసింహా రెడ్డి ఊరిమిండి వారిని పలువురు ప్రశంసించడం జరిగింది .
తరువాత విశ్రాన్త ఆచార్యులు శ్రీ బి. లలితానంద ప్రసాద్ గారు తాను అద్భుతంగా వ్రాసిన కొన్ని కవితలు చదివి వినిపించారు. వాస్తవితకు అద్దం పడుతున్న వారి స్వీయ కవితలు సాహితీ ప్రియుల మనసులను రంజింప చేశాయనడంలో సందేహం లేదు . అనంతరం శ్రీ లెనిన్ వేముల గారు మాట్లాడుతూ శ్మశానం అనే పేరు వినగానే మనస్సు కీడు శంకిస్తుందనీ అట్టి శ్మశానాన్ని తన కవితా వస్తువుగా ఎంచుకున్న జాషువా కవీంద్రుని కలంనుండి జాలువారిన అద్భుత ఖండకావ్యం ”శ్మశానవాటిక” లో ” కవుల కలాలు,గాయకుల కమ్మని కంఠము లీ సశ్మశానపుం గవనులఁ ద్రొక్కి చూచెడి;నొకానొకనాఁడల కాళిదాస భారవుల శరీరముల్ ప్రకృతిరంగమునం దిపు డెంత లేసి రేణువు లయి మృత్తికం కలిసెనో కద! కుమ్మరి వాని సారె పై.” పద్యము ను వీనుల విందుగా రాగయుక్తంగా పాడి జాషువా కవి రచనా శైలి యందలి వైశిష్ట్యాన్ని అద్భుతంగా వివరించారు.
అనంతరం స్టేటు బ్యాంక్ ఆఫ్ఇండియా లో పనిచేసి రిటైర్ అయిన శ్రీ గుళ్ళపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు సాహిత్యం పై మక్కువతో తాను తెలుగులో వ్రాసిన కొన్ని చిరు కవితలను చదివి వినిపించారు. ఆ కవితలను విన్నశ్రీ లెనిన్ వేముల వంటి సాహితీ ప్రియులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి కవితా నైపుణ్యాన్ని మెచ్చుకోవడం జరిగింది.
అనంతరం నేటి ముఖ్య అతిథి ,మరుగున పడిపోతున్న తెలుగు భాషను బతికించుకునేందుకు, కాలగర్భంలో కలిసిపోయేలా ఉన్న పద్య సాహిత్యాన్ని పది కాలాల పాటు కాపాడుకునేందుకు నడుంకట్టిన శ్రీ కొప్పరపు సూర్య ప్రకాశరావు శర్మ గారు మాట్లాడుతూ గురులఘువులతో మొదలుపెట్టి.. ఛందస్సుతో పద్య రచన ఎలా చేయాలనేదానిపై ప్రత్యేకంగా ‘పద్యరచనామృతబోధిని’ అనే పుస్తకం వ్రాశాననీ,ఎలాంటి చదువు చదువుకున్నా, ఏరంగంలో వుద్యోగం చేస్తున్నా తెలుగుపై అభిమానం ఉంటే చాలునని ,ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా ఛందస్సుతో పద్యాలు రాయగలరనీ చెప్పారు శ్రీ కొల్లారపు ప్రకాశరావు శర్మ గారు. ,ఆవిధంగా పద్యం ఛందస్సు కు సరియైన పదాల కోసం పర్యాయ పదాలను వాడేసమయములో యడాగమము బదులు అచ్చు వాడవచ్చునని ఉటంకిస్తూవేమన శతకము,సుమతీ శతకము లోని పద్యాలను, తెలంగాణా రాష్ట్ర మందలి మంథని అగ్రహారమున 350 సంవత్సరాల క్రితం వ్రాయబడిన , శ్రీ ముద్దు బాలంభట్టు విరచిత ”మంథెన్న రామాయణము” లోని పద్యాలు ‘ ,అదేవిధంగా ,ప్రఖ్యాత అవధానులు ,గరికపాటి నరసింహారావు విరచిత ”సాగర ఘోష ” శ్రీ నరాల రామిరెడ్డి గారు, ఇంకా పార్వతీశ్వర శర్మ గారు,ఎం రవి శర్మ గారు వ్రాసిన పద్యాలను వారి పద్య రచనలలోని పట్టు విడుపులను, చుక్కలు-కామాలు- వంటి “దృశ్య చిహ్నాలు” ఉండే పద్యాలన్నీ సో దాహరణముగా అద్భుతంగా వివరించారు శ్రీ కొల్లారపు ప్రకాశరావు శర్మ గారు… వీరి ప్రసంగం ఆద్యంతం ఎంతో ఆసక్తి దాయకం గా సాగింది.,టాంటెక్స్ సంస్థ పూర్వాధ్యక్షులు,డాక్టర్ తోటకూర ప్రసాద్ గారు , డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి వారు,శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారు ,ప్రముఖ సాహితీ ప్రియులు ,శ్రీ లెనిన్ వేముల గారు,శ్రీమతి కొమరవోలు సరోజ గారు,శ్రీ చిన సత్యం వీర్నాపు గారు, శ్రీ దయాకర్ మాడా గారు ,శ్రీ లలితానంద ప్రసాద్ గారు, శ్రీ ఎం.వీ, లోకనాధం గారు,శ్రీ గోవర్ధనరావు నిడిగంటి మొదలైన వారు శ్రీ కొల్లారపు ప్రకాశరావు శర్మ గారి విశిష్ట వ్యక్తిత్వాన్ని వారు ఆసక్తి గలవారికి పద్యరచన నేర్పుతున్న వైనాన్ని వేనోళ్ళ కొనియాడడం జరిగింది.
ఉత్తర టెక్సాస్ తెలుగుసంఘం టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు మరియు సంస్థ పాలక మండలి మరియు అధికార కార్యవర్గ బృందం సభ్యులతోపాటు,బోర్డు ఆఫ్ ట్రస్టీస్ మెంబర్ దయాకర్ మాడా గారు, నేటి ముఖ్య అతిథి శ్రీ కొల్లారపు ప్రకాశరావు శర్మ గారి కి టాంటెక్స్ సంస్థ తరపున సమర్పించిన సన్మాన పత్రము జ్ఞాపిక ను చదివి వినిపించి”పద్య శంకర ”బిరుదుతో ఘనంగా సన్మానించడం జరిగింది.
టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు గారు సంస్థ పూర్వాధ్యక్షులు,డాక్టర్ ప్రసాద్ తోటకూర గారు , ,డాక్టర్ నరసింహా రెడ్డి ఊరిమిండి గారు, శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారు, శ్రీ వీర్నాపు చిన్న సత్యం గారు , శ్రీ లెనిన్ వేముల గారు గారు,కె ఎం శ్రీనివాసరావు గారు ,శ్రీ బి.లలితానంద ప్రసాద్ గారు,వారి కుటుంబ సభ్యులు ,ప్రత్యక్షము గానూ ,శ్రీమతి సరోజ కొమరవోలు గారు,శ్రీ నంద గారు, గారు,శ్రీమతి విజయలక్ష్మి గారు,శ్రీమావిళ్ల రంగయ్య గారి లోకనాధం గారు,శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు, ,, శ్రీ గోవర్ధనరావు నిడిగంటి వంటి సాహితీ ప్రియులు అనేకమంది అంతర్జాలంద్వారా హాజరవడంతో సదస్సు విజయవంత మైంది. ఈ సాహితీ సదస్సుకు సాహితీ ప్రియులను పేరు పేరున ఆహ్వానించి న శ్రీలేనిన్ వేముల గారు తమ ఇంటిని నేటి సదస్సుకు వేదికగా చేయడం అంతేగాక శ్రీమతి కిరణ్మయి గారు శ్రీమతి గౌతమీ గారు స్వయంగా వండిన మధుర భక్ష్యాలతో ఆహూతులకు సుష్టుగా విందుభోజనం ఆరగింప చేయడం మరింత అభినందనీయం .సాహితీ ప్రియుల మన్నలను విశేషంగా అందుకొన్న ఈ సదస్సును విజయ వంతం చేసిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు గారు,బోర్డు ఆఫ్ ట్రస్టీస్ మెంబర్ మరియు టాంటెక్స్ సంస్థ కార్యక్రమాల సలహాదారు డాక్టర్ దయాకర్ మాడా గారు,శ్రీ లెనిన్ వేముల గారు, సంస్థ సమన్వయ కర్త శ్రీ లక్ష్మి నరసింహ పోపూరి గారు మరియు టాంటెక్స్ పాలకమండలి సభ్యులు అభినందనీయులు.