Namaste NRI

సరిపోదా శనివారం షూటింగ్.. యాక్షన్ షెడ్యూల్‌ ప్రారంభం

నాని హీరోగా దర్శకుడు వివేక్‌ ఆత్రేయ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం సరిపోదా శనివారం. ప్రియాంక అరుళ్‌మోహన్‌ కథానాయిక. ఈ చిత్రంలో ఎస్‌.జె.సూర్య కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లో మొదలైంది. ఫైట్‌ మాస్టర్‌లు రామ్‌ లక్ష్మణ్‌ నేతృత్వంలో భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో యాక్షన్‌తో పాటు కొంత టాకీపార్ట్‌ను తెరకెక్కించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. నానితోపాటు ప్రధాన తారాగణమంతా ఈ షెడ్యూల్‌లో భాగం కానున్నారని దర్శకుడు వివేక్‌ ఆత్రేయ చెబుతున్నారు.  ఈ చిత్రానికి కెమెరా: మురళి.జి. సంగీతం: జేక్స్‌ బిజోయ్‌, నిర్మాతలు: డి.వి.వి.దానయ్య, కళ్యాణ్‌ దాసరి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events