తాలిబన్ ప్రభుత్వ హోంమంత్రి కీలక ప్రకటన చేశారు. అమెరికాతో మాత్రమే కాకుండా, ప్రపంచ దేశాలన్నింటితోనూ తాము సత్సంబంధాలనే నెరుపుతామని తాలిబన్ ప్రభుత్వ హోంమంత్రి సిరాజుద్దీన్ హక్కానీ కీలక ప్రకటన చేశారు. గత 20 ఏళ్లుగా తాము యుద్ధాలు, రక్షణ రంగం అంటూ గడిపేశామని గుర్తు చేసుకున్నారు. దోహా ఒప్పందం తర్వాత వాటి గురించి మాట్లాడొద్దని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. ఇకపై వాటీ ఊసే ఎత్తమని, అమెరికాతో సహా అన్ని దేశాలతో సత్సంబంధాలనే కోరుకుంటున్నామని ఆయన వెల్లడిరచారు.