ధనుష్ కథానాయకుడిగా నటిస్తూ, శ్రద్ధా అగర్వాల్, అజ్మత్ జగ్మాగ్లతో కలిసి నిర్మించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఓం – చాప్టర్ 1. మమ్ముట్టి ఇందులో కీలక పాత్ర పోషించారు. సాయిపల్లవి, శ్రీలీల కథానాయికలు. ససీరుద్దీన్ షా ప్రత్యేక పాత్రధారి. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకుడు. ప్రతిష్టాత్మక సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో మమ్ముట్టి మాట్లాడారు. తెలుగు ప్రేక్షకులు చాలాకాలంగా నన్ను ఆదరిస్తూనే ఉన్నారు. వారి ఋణం తీర్చుకోలేనిది. ఓం చాలా ప్రత్యేకమైన సినిమా. దర్శకుడు రాజ్‌కుమార్ పెరిసామి ఈ పాత్ర నేనే చేయాలని పట్టుపట్టాడు. నాకోసం చాలా రోజులు వెయిట్ చేశాడు. టీమ్ అంతా చాలా కష్టపడి పనిచేశారు. ధనుష్, సాయిపల్లవిలతో పాటు అందరూ ఎనర్జిటిక్ పీపుల్స్ పనిచేశారీ సినిమాలో. తప్పకుండా విజయం సాధించే సినిమా ఇది అని మమ్ముట్టి నమ్మకం వెలిబుచ్చారు.

హీరో ధనుష్ మాట్లాడుతూ ఓం నా కెరీర్‌కి చాలా ముఖ్యమైన సినిమా. ఇది దాదాపుగా బైలింగ్వెల్. తమిళ వెర్షన్ చూసినా తెలుగుకు దగ్గరగా ఉంటుంది. ఇందులో ప్రతీ పాత్రకూ ప్రాధాన్యత ఉంటుంది. ఇది వెరీ కాంప్లెక్స్ స్టోరీ. దర్శకుడు రాజ్‌కుమార్ గొప్పగా తీశాడు. అద్భుతమైన టీమ్ పనిచేసిన సినిమా ఇది. మమ్ముట్టిగారితో వర్క్‌చేయడం చాలా ఆనందంగా ఉంది. అందరినీ ఓ ప్రపంచంలోకి తీసుకెళ్లే సంచలనాత్మక చిత్రమిది అని అన్నారు. కథానాయికలు సాయిపల్లవి, శ్రీలీల, నటి రేణుదేశాయ్లతోపాటు చిత్రబృందమంతా మాట్లాడారు. ఈ నెల 19న సినిమా విడుదల కానున్నది.















