తమ దేశాన్ని ఏకాకిని చేయడం కష్టమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ప్రపంచం చాలా పెద్దదని, అందులో రష్యా లాంటి దేశాన్ని ఒంటి చేయడం అసాధ్యమని పేర్కొన్నారు. భారత్, చైనాలతోనే కాదు లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలతోనూ సంబంధాలను ఏర్పరచుకొనే సత్తా తమకు ఉందని అన్నారు. రష్యా లాంటి దేశానికి కంచె వేసి బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచడం కుదరదని తెలిపారు. మరోవైపు అమెరికాకు సమీపంలోని నికరాగవా, తమ దేశంలోకి రష్యా సైనికులు ప్రవేశించేందుకు స్థావరాలు ఏర్పరచుకొనేందుకు అనుమతినిచ్చింది. దీనిపై రష్యా స్పందిస్తూ ఇదేమీ కొత్త కాదని పేర్కొంది. అమెరికా, మెక్సికో, ఇతర మధ్య అమెరికా దేశాలకు కూడా నికరాగవా ఇదే రకమైన సైనిక అనుమతులు మంజూరు చేసిందని తెలిపింది.
