విరాన్ ముత్తంశెట్టి, లావణ్య జంటగా నటిస్తున్న చిత్రం ముఖ్యగమనిక. వేణు మురళీధర్ దర్శకుడు. రాజశేఖర్, సాయికృష్ణ నిర్మాతలు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. యువహీరో విశ్వక్‌సేన్ అతిథిగా విచ్చేసి యూనిట్‌సభ్యులకు శుభాకాంక్షలు అందించారు. మా హీరో విరాన్ సమయపాలన గల వ్యక్తి. హీరోయిన్ లావణ్య కూడా చాలా బాగా నటించింది. సాంకేతికనిపుణులంతా మనసుపెట్టి పనిచేశారు అని దర్శకుడు చెప్పారు. ప్రేక్షకులకు నచ్చే అన్ని ఎలిమెంట్స్ ఈ కథలో ఉన్నాయని, యూనిట్ మొత్తం ఒక కుటుంబంలా సపోర్ట్ చేశారని హీరోయిన్ అన్నారు. సాంకేతికంగా ఈ సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుందని హీరో తెలిపారు. అర్యన్, చిత్రం భాష ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ, డైరెక్షన్: వేణు మురళీధర్.వి., సంగీతం: కిరణ్ వెన్న.