స్రవంతి రవికిషోర్ నిర్మించిన తొలి తమిళ చిత్రం కిడ. ఆర్.కె.వెంకట్ దర్శకత్వం. పూరాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను తెలుగులో దీపావళి పేరుతో అనువదిస్తున్నారు. స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ ఓ స్నేహితుడి ద్వారా ఈ కథ విన్నా. వెంటనే కనెక్ట్ అయ్యాను. తొలి చిత్రమైనా దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు అన్నారు. ఓ తాత, ఓ మనవడు, ఓ మేక ఈ మూడింటి చుట్టూ కథ నడుస్తుంది. అందమైన ప్రేమకథ కూడా ఉంటుంది. గ్రామీణ నేపథ్యంలో హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలతో ఆకట్టుకుంటుంది అని చిత్ర బృందం పేర్కొంది. తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 11న విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎం.జయప్రకాష్, సంగీతం: థీసన్.