మాతృత్వం కోసమే రాజకీయాల నుంచి వైదొలిగినట్లు న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిండా అర్డర్న్ చెప్పారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ పార్లమెంట్‌లో జరిగిన వీడ్కోలు సభలో జెసిండా మాట్లాడుతూ మంచి తల్లిగా ఉండటానికి నేను పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నా అన్నారు. పాలిటిక్స్‌లో మహిళలు రాణించడానికి, నాయకత్వం వహించడానికి మాతృత్వం అడ్డు కాకూడదు. లేబర్ పార్టీ నేతగా ఎన్నికైనప్పుడు నా మాతృత్వాన్ని కోల్పోవాలనుకోలేదు. ప్రధానిగా ఎన్నికయ్యాక తల్లిని కాబోతున్నట్లు తెలిసి ఎంతగానో సంతోషించా. నేతలు కూడా మనుషులే. వారి శక్తి, సామర్థ్యాలకు అనుగుణంగా సేవ చేస్తారు. వారి సొంత జీవితం కోసం టైం కేటాయించాలి. ఇప్పుడు నాకు ఆ టైం వచ్చింది అని చెప్పారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-23.jpg)
దేశానికి సారధ్యం వహించడం ఎంతో ఉన్నతమైంది. ప్రస్తుతం వాతావరణం మార్పు మన ముందు గల పెద్ద సంక్షోభం.. ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. పర్యావరణ పరిరక్షణపై పాలిటిక్స్ చేయొద్దు.. పర్యావరణాన్ని పాలిటిక్స్‌కు దూరంగా ఉంచండి అని అన్నారు. గత జనవరిలో ప్రధాని పదవికి జెసిండా ఆర్డర్న్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ఆమె తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/4b3127df-f30c-4f25-9c19-7ecfdbd57b90-51-24.jpg)