Namaste NRI

ఇప్పుడు ఆ ఉద్దేశం లేదు: ఇరాన్‌

ఇరాన్‌ అణ్వస్త్రాలను తయారు చేయగలదని ఆ దేశ అణు శక్తి సంస్థ చీఫ్‌ మహమ్మద్‌ ఇస్లామీ ప్రకటించారు. గతంలో ఇరాన్‌ అధ్యక్షుడు అయతుల్లా అలీ ఖమేనీకి ప్రధాన సలహాదారు అయిన కమల్‌ ఖరాజి చేసిన వ్యాఖ్యలను మహమ్మద్‌ ఇస్లామీ సమర్థించారు. దుబాయి పర్యటనలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంతుకు ముందు ఖరాజీ చెప్పినట్లుగా ఇరాన్‌కు సాంకేతికంగా అణు బాంబులను తయారు చేసే సామర్థ్యం ఇప్పటికే ఉంది. కావాలనుకుంటే అణ్వస్త్రాలను తయారు చేయగలం. అయితే ప్రస్తుతానికి అణు బాంబు తయారు చేయాలన్న అంశం మా అజెండాలో లేదు అని మహమ్మద్‌ ఇస్లామీ వెల్లడిరచారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events