జపాన్‌లో ఒంటరి పెండ్లి కొత్త ట్రెండ్‌గా మారింది. యువతులు తమను తామే మనువాడుతున్నారు. సంప్రదా యబద్ధమైన పెండ్లి తంతు వదిలిపెడుతున్నారు. పెళ్లి కొడుకు ఉండని ఈ కొత్త పెండ్లి ట్రెండ్‌లో వివాహ తంతును అన్ని రకాల హంగు, ఆర్భాటాలతో నిర్వహిస్తున్నారు. కొందరు యువతులు తమ జీవితంలో చాలా ముఖ్యమైన కార్యక్రమంగా దీనిని చేసుకుంటున్నారు. మరికొందరు సొగసైన తెల్లని గౌనును ధరిస్తున్నా రు. ఈ ట్రెండ్‌కు ఆద్యురాలు అడల్ట్ వీడియో స్టార్ మన సకుర. ఆమె 2019 మార్చిలో తనను తానే పెళ్లి చేసుకుంది. నేను నా సొంత జీవితాన్ని గౌరవిస్తాను. ఆరోగ్యంగా ఉన్నా, రోగగ్రస్థురాలినైనా, నన్ను నేను ఎల్ల వేళలా ప్రేమిం చుకుంటాను, నన్ను నేను సంతోషపరచుకుంటాను అని ప్రతిజ్ఞ చేసింది. హనవోకా అనే యువతి కూడా ఏకాకి పెళ్లి చేసుకుంది.
నన్ను నేను పెళ్లి చేసుకోవడమంటే, పురుషుడిని పెళ్లి చేసుకోవాలని కోరుకోవడం లేదని కాదు అని ఆమె చెప్పింది. వివాహిత మహిళలు కూడా ఒంటరి పెళ్లిళ్లు చేసుకోవడం విశేషం. మరోవైపు సంప్రదాయబద్ధమైన పెళ్లిళ్లు తగ్గిపోయినట్లు జపాన్ ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. అయితే సోలో వెడ్డింగ్స్ పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నదని తెలుస్తున్నది. ఏకాకి పెళ్లి చేసుకునేవారు సోలో హనీమూన్‌కు కూడా వెళ్తున్నారు.