రష్యా జనాభాను పెంచడానికి మహిళలు నడుంబిగించాలని అధ్యక్షుడు పుతిన్ పిలుపునిచ్చారు. కనీసం ఎనిమిది అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా దాదాపు 3 లక్షల మందిని కోల్పోయినట్టు పలు సంస్థలు చెప్తున్న విషయం తెలిసిందే. మాస్కోలో జరిగిన వరల్డ్ రష్యన్ పీపుల్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఉద్దేశించి పుతిన్ మాట్లాడుతూ పాత కాలంలో మనవాళ్లు ఏడెనిమిది మంది పిల్లలను కనేవాళ్లు. కానీ మనం ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని మరిచిపోయాం. కాబట్టి మన తాతలను చూసి మనం నేర్చుకోవాలి. వాళ్లలాగే ప్రస్తుత తరంవాళ్లు ఏడెనిమిది మంది పిల్లలను కనాలి. ఇలా చేయడం వల్ల కుటుంబం బలపడటమే కాకుండా దేశానికి ప్రయోజనం చేకూరుతుంది అని పేర్కొన్నారు.
