Skip to main content

Namaste NRI

ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని మరిచిపోయాం :  పుతిన్‌

రష్యా జనాభాను పెంచడానికి మహిళలు నడుంబిగించాలని అధ్యక్షుడు పుతిన్‌ పిలుపునిచ్చారు. కనీసం ఎనిమిది అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా దాదాపు 3 లక్షల మందిని కోల్పోయినట్టు పలు సంస్థలు చెప్తున్న విషయం తెలిసిందే. మాస్కోలో జరిగిన వరల్డ్‌ రష్యన్‌ పీపుల్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఉద్దేశించి పుతిన్‌ మాట్లాడుతూ పాత కాలంలో మనవాళ్లు ఏడెనిమిది మంది పిల్లలను కనేవాళ్లు. కానీ మనం ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని మరిచిపోయాం. కాబట్టి మన తాతలను చూసి మనం నేర్చుకోవాలి. వాళ్లలాగే ప్రస్తుత తరంవాళ్లు ఏడెనిమిది మంది పిల్లలను కనాలి. ఇలా చేయడం వల్ల కుటుంబం బలపడటమే కాకుండా దేశానికి ప్రయోజనం చేకూరుతుంది అని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News