ఓ ఎన్నారై ఇస్రో శాస్త్రవేత్తలకు ఏకంగా కోటి రూపాయల నజరానా ప్రకటించారు. రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాకు చెందిన పృథ్వీరాజ్ సింగ్ కోలూకు అరబ్ దేశాల్లో ప్రాకాశ్ పంప్స్ అనే కంపెనీ ఉంది. విదేశాల్లో ఉన్నతస్థితిలో ఉన్న ఆయన మాతృదేశానికి సేవ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇస్రో అందించిన చంద్రయాన్-3 విజయం ఆయన మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. దీంతో, ఆయన వెంటనే ఇస్రో శాస్త్రవేత్తలకు రూ. కోటి రూపాయల బహుమతిగా ప్రకటించి తన దేశభక్తిని చాటుకున్నారు. కరోనా సమయంలో జిల్లాలోని ఓ మెడికల్ కాలేజీలో రెండున్నర కోట్లతో అత్యాధునిక ఐసీయూ వార్డును ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, జిల్లాలోని కావాస్ గ్రామ వరద బాధితులకు కూడా ఆపన్న హస్తం అందించారు.
