అమెరికాలోని సియాటిల్‌లో ఈ నెల 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి జాహ్నవి కందుల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతికి సంతాపంగా అక్కడి స్థానికులు ప్రమాదం జరిగిన డెక్స్టర్ అవెన్యూ నార్త్లోని థామస్ స్ట్రీట్, వెస్ట్లేక్ పార్క్ వద్ద శుక్రవారం క్యాండిల్స్ వెలిగించి సంతాపం ప్రకటించారు. సైకిల్ ర్యాలీ నిర్వహించి, జాగరణ చేశారు. ఈ కార్యక్రమంలో భారీ మొత్తంలో స్థానికులతో పాటు ఎన్నారైలు పాల్గొన్నారు.
ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి కందుల జనవరి 23 (సోమవారం) రాత్రి 8 గంటల (అమెరికా కాలమానం ప్రకారం) ప్రాంతంలో డెక్స్టర్ అవెన్యూ నార్త్, థామస్ స్ట్రీట్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో పోలీసుల వాహనం ఢీకొట్టింది.