ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌కు చెందిన ఎన్నారై లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిని మర్యాద పూర్వకంగా విజయవాడలోని ఆయన నివాసంలో కలిశారు. త్వరలో మెల్బోర్న్‌లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు, మహానాడును నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా అచ్చెన్నాయుడిని ఎన్నారైలు కోరారు. అచ్చెన్నాయుడిని కలిసిన వారిలో విక్టోరియా స్టేట్ తెలుగుదేశం ప్రెసిడెంట్ దేవేంద్ర పర్వతనేని, సభ్యులు శ్రీనాథ్ కనగాల తదితరులు ఉన్నారు.