Namaste NRI

బసవతారకం హాస్పిటల్‌కు వీల్ ఛైర్లు అందించిన ఎన్నారై పొట్లూరి రవి

భారతదేశంలోని ఉత్తమ క్యాన్సర్ హాస్పిటల్‌లలో ఒకటిగా పేరొందిన హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌కు ఎన్నారై పొట్లూరి రవి ముప్పై వీల్ ఛైర్లు అందించారు. బసవతారకం హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ ద్వారా 30  వీల్ చైర్లని హాస్పిటల్‌కి అందించారు. క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా నందమూరి బాలకృష్ణ చేస్తున్న సేవలు వెలకట్టలేనివని లక్షలాది అభిమానులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని పొట్లూరి రవి తెలిపారు. తర్వాత జరిగిన కార్యక్రమంలో పొట్లూరి రవి అందించిన బ్రెడ్ ప్యాకెట్లను బాలకృష్ణ హాస్పిటల్ లోని ఐదువందలకు పైగా రోగులకు పంపిణీ చేసారు.  ఈ కార్యక్రమంలో ముప్పా రాజశేఖర్, సందడి మధు, జంపాల అమిత్ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events