తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఎన్నారై టీడీపీ బెల్జియం అధ్యక్షుడు అలవాలపాటి శివకృష్ణ, కొండూరు దినేష్ వర్మ ఆధ్వర్యంలో బ్రస్సెల్స్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో శివ కృష్ణ మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా ఎఫ్‌ఐఆర్ తోపాటు చార్జిషీట్ లో చంద్రబాబు పేరు లేకుండా అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ బెల్జియం కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

