మహాత్మాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని స్కాట్ల్యాండ్‌లోని అబర్డీన్ నగరంలో టీడీపీ మద్దతుదారులు సభ నిర్వహించారు. కులమతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో హాజరైన సభ్యులు గాంధీ మహాత్ముణ్ణి తలచుకుని తమ స్వస్థలం అయిన ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్న అరాచక పాలన, రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపిస్తున్న ప్రభుత్వ విధానాలను ప్రస్తావిస్తూ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వారు వ్యవహరిస్తున్న తీరును ముక్తకంఠంతో ఖండించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన చేపట్టిన నిరాహారదీక్షకు తమ సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా తెదేపా, జనసేన మద్దతుదారులు కార్లతో సిబిఎన్ ఆకృతిని, పిదప ర్యాలీని నిర్వహించారు. జనసేన మద్దతుదారులు కూడా ఈ నిరసనకు తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగ ప్రమోద్ మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రగతికై తన జీవితాన్ని ధారపోసిన తమ ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడుపై అనైతికంగా అక్రమ కేసులు పెట్టడమే కాకుండా ఆయన వయస్సుకు, అనుభవానికి విలువ ఇవ్వకుండా ఆయన వ్యక్తిగత హక్కులను సైతం హరించే విధంగా వ్యవహరిస్తున్న వైకాపా ప్రభుత్వ తీరును తీవ్రంగా ఆక్షేపించారు. సభలో ప్రదీప్ వేజెండ్ల, అజయ్ నార్నె, రావి శ్రీనివాస్, రంగనాథ్ గడగొత్తు తదితరులు పాల్గొన్నారు.